అ రికార్డ్ కే‌సి‌ఆర్ కే సొంతం !

46
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పారు. ఇప్పటివరకు అధికారం చేతులు మారకుండా ఏకబిగిన 9 ఏళ్ళు నిరాటంకంగా పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రిగా కే‌సి‌ఆర్ రికార్డ్ సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 36 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇటు ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు, అటు తెలంగాణకు కే‌సి‌ఆర్ తొలి ముఖ్యమంత్రులుగా పదవి భాద్యతలు చేపట్టారు. ఇలా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్యమంత్రుల పాలన కాలాన్ని పరిశీలిస్తే కే‌సి‌ఆర్ అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా చెప్పుకోవచ్చు.

Also Read: CM KCR:దేశానికే తలమానికంగా తెలంగాణ అభివృద్ధి

2014 జూన్ 2 న తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలు చేపట్టిన ఆయన 2023 జూన్ 2 నాటికి 9 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇక అ తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నిలుస్తారు ఈయన పాలన ఎనిమిదేళ్ళ 256 రోజులు సాగింది. అ తరువాతి స్థానాలలో కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్లు, ఎన్టీ రామారావు 7 ఏళ్ళు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ళు.. ఇలా పాలన సాగించారు. ఓవరాల్ గా అందరి కంటే ఎక్కువగా కే‌సి‌ఆర్ పాలన సాగించిన ( సాగిస్తున్న ) నేతగా కే‌సి‌ఆర్ రికార్డ్ లలో నిలిచారు. ఇక ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి పాలన సాగిస్తున్న నేతగా దేశంలో ఎవరికి లేని రికార్డ్ ను కే‌సి‌ఆర్ సొంతం చేసుకొనున్నారు. మొత్తానికి ఆయన అందిస్తున్న సుపరిపాలనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి.

Also Read: తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్

- Advertisement -