వారణాసికి ‘పుష్ప’రాజ్..

40
bunny

టాలీవుడ్‌ హీరో స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో గిరిజన యువతి పాత్రలో రష్మిక కనిపిస్తుండగా.. పుష్పరాజ్ అనే డ్రైవర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు.

ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొంత జరుపుకుంది. అక్కడ బన్నీపై కొన్ని యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. ఇక తిరిగి తదుపరి షెడ్యూలును డిసెంబర్ 18 నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూలుని వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. అక్కడ ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. కాశీ బ్యాక్ డ్రాప్‌లో ఆ పాటను చిత్రీకరించాల్సి ఉన్నందున అక్కడికి వెళుతున్నారని సమాచారం.