కరెన్సీ నోట్ల రద్దు ఇది తొలిసారి కాదు…

193
A brief history of India pulling bank notes from circulation
- Advertisement -

దేశం మొత్తం ఇప్పుడు కుదిపేస్తున్న అంశం 500,1000 రూపాయల నోట్లు. పాత కరెన్సీ నోట్ల రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది సేపటికే నల్ల కుబేరుల గుండెల్లో రైల్లో పరుగెడుతున్నాయి. నిజానికి దేశంలో ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి కాదు. 1946 జనవరిలో తొలిసారి ఆర్బీఐ రూ.1000, రూ.10వేల నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత 1954లో రూ.1000, రూ.ఐదువేలు, రూ.10వేల నోట్లను కొత్తగా ఆర్బీఐ ప్రవేశ పెట్టింది. 1978 జనవరిలో రూ.10వేలు, రూ.వెయ్యి నోట్లను నాటి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మళ్లీ చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఇదే తొలిసారి.

ఆర్థిక వ్యవస్థను ప్రక్షాలణ చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను మంగళవారం నుంచి రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో రూ.1000 నోట్లు తిరిగి వచ్చాయి. నవంబర్ 2000లో ఈ నోట్లు తిరిగి వచ్చాయి. 1987లోనే రూ.500 నోట్లు చలామణిలోకి వచ్చాయి.

రూ.10 నోటు పైన అశోకా పిల్లర్ వాటర్ మార్క్ 1967 -1992 మధ్య వచ్చింది. రూ.20 నోటు పైన 1972 – 1975 మధ్య, రూ.50 నోట్ పైన 1975 – 1981 మధ్య, రూ.100 నోటు పైన 1967 – 79 మధ్య వచ్చింది. 1980 నుంచి కరెన్సీ నోట్ల పైన సత్యమేవ జయతే అని రాస్తున్నారు. ఇది జాతీయ చిహ్నం కింద ఉంటుంది. 1987లో మహాత్మా గాంధీ, అశోక పిల్లర్ వాటర్ మార్కుతో రూ.500 నోటును తెచ్చారు. రూ.500 రూ.1000 నోట్లను తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది.

పాత నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరమైన ఈ నిర్ణయం గురించి ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐలోని అతికొద్ది మంది ముఖ్యులకు తప్ప కనీసం ప్రభుత్వ పెద్దలకు కూడా ఏమీ తెలియదని, నోట్ల రద్దు నిర్ణయాన్ని పకడ్బందీగా వెల్లడించాలనే ఉద్దేశంతోనే సమాచారాన్ని గోప్యంగా ఉంచామని శక్తికాంత అన్నారు.

బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా పాత నోట్లను సేకరిస్తామన్న ఆర్థిక శాఖ కార్యదర్శి.. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామన్నారు. బుధవారం బ్యాంకులు మూసివేస్తామని, గురువారం నుంచి కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలకూ హెల్ప్ లైన్స్ ఏర్పాటుచేశామని, సామాన్యులకు ఇబ్బంది కలుగకుండా ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపారు.

- Advertisement -