వికలాంగుడికి ద్విచక్ర వాహానం కొనిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ..

235
TRS MLC
- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి వాట్సప్‌లో మేసెజ్ ద్వారా తనకు ఒక వాహనం ఇప్పించాలని బాధను వెల్లడించాడు. ఇందుకు వెంటనే స్పందించిన కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శభీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తన నిధులతో హొండా యాక్టివా వాహానాన్ని కోనుగోలు చేసి ఈ రోజు కేటీఆర్‌ సమక్షంలో ప్రగతి భవన్‌లో సమక్షంలో శివకు అందిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు,స్దానిక ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.

- Advertisement -