డిఫరెంట్‌ కంటెంట్‌తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌

1
- Advertisement -

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బాబీ కొల్లి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నేను ఈవెంట్ కి రావడం కారణం రైటర్ మోహన్. నేను, మోహన్ కలిసి ఒక డైరెక్టర్ దగ్గర రైటర్స్ గా పని చేసాం. ఈ సినిమాతో తను దూసుకుపోతాడనే నమ్మకం ఉంది. మోహన్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు. ఈ సినిమాని ఫన్ తో పాటు సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేయడం చాలా మంచి ఐడియా. తను సస్పెన్స్ ని చాలా అద్భుతంగా తీసాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అనన్య గారికి చాలా సక్సెస్ లు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోహన్ ని నమ్మి ఈ సినిమా చేసిన రమణా రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. వంశి గారి పేరు మారుమ్రోగిపోతోంది. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థం అవుతుంది. కంటెంట్ చాలా కొత్తగా వుంది. డిసెంబర్ 25న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమాతో ఒక హిట్ సినిమాని థియేటర్స్ లోకి పంపిస్తున్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. చాలా పాజిటివ్ గా ఉంది. ఈ సినిమా కథని నమ్మే సినిమా చేసిన రమణ రెడ్డి గారికి కంగ్రాజులేషన్స్. చిన్న సినిమాలు పెద్ద హిట్ లు కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో కూడా అదే కోరుకుంటున్నాను. ఇందులో కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారెంటీ. మోహన్ గారు డైరెక్టర్ గా కూడా పెద్ద పెద్ద సక్సెస్ లు కొట్టాలని కోరుకుంటున్నాను. అనన్య గారు ఏ క్యారెక్టర్ చేసిన అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వంశి గారు ఈ సినిమాకి చాలా బాగా యాడ్ అయ్యారని నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్’ అన్నారు.

Also Read:అల్సర్ ఉందా..అయితే మీ కోసమే!

- Advertisement -