మంత్రుల ప్రమాణస్వీకారానికి రోజా డుమ్మా ..కారణం అదేనా?

256
mla roja
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న జగన్ కేబినేట్ నేడు కొలువుదిరింది. 25మంది మంత్రులతో నేడు ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగిన వారికి నిరాశే ఎదురైంది. అందులో మొదటి వరుసలో ఉన్న నేత ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా.

అయితే నేడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో రోజా పేరు లేకపోవడంతో ఆమె నిరాశకు గురైనట్లు తెలుస్తుంది. అయితే మంత్రి పదవులు దక్కని నేతలు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజా మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

చివరి నిమిషంలో రోజా పేరును మంత్రివర్గం నుండి తప్పించారు. శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు దఫాలు రోజాతో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో ఎందుకు చోటు కల్పించలేకపోయారనే విషయాన్ని జగన్ ఆమెకు వివరించారు.

- Advertisement -