పవన్ కళ్యాణ్ కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి

229
Ravela Janasena
- Advertisement -

ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్ధానంలో విజయం సాధించింది జనసేన. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ కూడా ఒడిపోవడం పార్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజాగా జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంపారు.

వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తక్షణం తన రాజీనామా లేఖను ఆమోదించాలని లేఖలో కోరారు టీడీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా కొనసాగారు. కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీని వీడి జనసేన లో చేరారు. దీంతో ఆయన ఇటివలే జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక రావెల కిషోర్ బాబు అధికార వైసిపిలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

- Advertisement -