ఏపీ కొత్త మంత్రి వర్గం కూర్పు పూర్తయింది. మంత్రి వర్గంలో ఒక ముస్లిం సహా ఎనిమిది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలకు, నలుగురు కాపులు, నలుగురు రెడ్డి కులస్థులకు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు స్థానం దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి డిప్యూటి స్పీకర్ పదవి వరించింది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందజేశారు. ఇక శనివారం ఉదయం 11.49గంటలకు సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు వీళ్లే..
కురసాల కన్నబాబు-కాకినాడ రూరల్
బొత్స సత్యానారాయణ- చీపురుపల్లి
ధర్మాన కృష్ణదాస్- నరసన్నపేట
అవంతి శ్రీనివాస్-భీమిలీ
పుష్పశ్రీవాణి-కురుపాం
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి-ఒంగోలు
పినిపె విశ్వరూప్-అమలాపురం
ఆళ్ల నాని-ఏలూరు
కొడాలి నాని-గుడివాడ
శ్రీరంగనాథ రాజు-ఆచంట
పేర్ని నాని-మచిలీపట్నం
తానేటి వనిత-కొవ్వూరు
మేకతోటి సుచరిత-ప్రత్తిపాడు
వెల్లంపల్లి శ్రీనివాస్-విజయవాడ ఈస్ట్
ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు)
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఆత్మకూరు)
మోపిదేవి వెంకటరమణ(గుంటూరు జిల్లా)