ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి సగౌర్వంగా ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను రెపరెపలాడించాడు వికారాబాద్ జిల్లా, ఎల్లకొండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఆటోడ్రైవర్ కొడుకు గుంతల తిరుపతి రెడ్డి. ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న తిరుపతి ఈ పర్వతారోహణలో తనకు ఎదురైన అనేక గడ్డు పరిస్థితులను పంచుకున్నాడు.
ప్రతికూల వాతావరణంతో చాలా ఇబ్బందులు పడ్డాం, పర్వతారోహణ చేస్తున్నప్పుడు చాలా మంది మార్గమద్యంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. బేస్ క్యాంప్ నుంచి బయలుదేరుతున్నప్పడు కచ్చితంగా ఎవరెస్ట్ అధిరోహించే కిందకి దిగాలనే సంకల్పం పెట్టుకున్నాను. ప్రాణాలకు బయపడకుండా విజయవంతంగా ఎవరెస్ట్‌ను అధిరోహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు తిరుపతి.
ఈ విజయం నాలాంటి ఎందరో గ్రామీణ యువకులకు అంకితమిస్తున్నట్టు తిరుపతి రెడ్డి అన్నారు. ఎవరెస్ట్‌కు ఎక్కడానికి బయలుదేరే ముందు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బీడియల్ ఉద్యోగులకు చెందిన విన్నర్స్ ఫౌండేషన్ మరియు కొంత మంది ధాతలు ఆర్థికంగా ఆదుకోవడంతో నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని తిరుపతి రెడ్డి తెలిపారు.