కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి పేరు ఖరారు?

507
Kishan Reddy
- Advertisement -

తెలంగాణ బీజేపీ సినియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అధిష్టానం నుంచి పిలుపు రానుందని తెలుస్తుంది. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 4గురు బీజేపీ ఎంపీలు గెలిచిన సంగతి తెలిసిందే. సికింద్రబాద్ నుంచి కిషన్ రెడ్డి విజయం సాధించగా, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవిందర్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదిలాబాద్ నుంచి సోయం బాపురావులు విజయం సాధించారు.

ఇక ఈ నలుగురిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా కేంద్రమంత్రి పదవి వరించనుంది. వీరందరిలో సీనియర్ నేత కిషన్ రెడ్డి కాబట్టి బీజేపీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తుంది. కాగా గతంలో ఆయన ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఆయనకు ఢిల్లీ నేతలతో బాగా పరిచయాలు కూడా ఉన్నాయి. దీంతో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వరించనున్నట్లు తెలుస్తుంది.

గతంలో సికింద్రబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన సీనియర్ నేత దత్తాత్రేయ కూడా కేంద్రంలో మంత్రి పనిచేసిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్ కూడా కేంద్రంలో మంత్రి పదవికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల వద్ద ఆయన మంతనాలు జరుపుతున్నారట. కానీ కిషన్ రెడ్డికి ఆల్రెడి బెర్త్ ఖరారు అయినట్లు తెలుస్తుంది.

- Advertisement -