జగన్ కు స్కూల్ ఫ్రెండ్స్ సర్ ప్రైజ్..

307
YS-JAGAN school friends

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నాడు. ఈసందర్భంగా సభావేదిక వద్దకు భారీ జనం చేరుకుంటున్నారు. విజయవాడ మెయిన్ రోడ్డు ప్లేక్సిలతో నిండిపోయింది. విజయవాడలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెట్టిన బ్యానర్ వైరల్ గా మారింది. జగన్ మా స్కూల్ లోనే చదువుకున్నాడు అంటూ విజయవాడలో బ్యానర్లు పెట్టారు స్కూల్ యాజమాన్యం. ఇక జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడన్న విషయం తెలిసిందే.

మా స్కూల్ లో చదివిన విద్యార్ధి సీఎం అయ్యాడంటూ గర్వగా చెప్పుకుంటున్నారు స్కూల్ యాజమన్యం. తన చిన్ననాటి స్నేహితుడు జగన్.. ఏపీ సీఎం కావడం పట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీఎస్‌లో 1979లో ఒకటో తరగతిలో చేరి ప్లస్‌ 2వరకు అక్కడే పూర్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సినీ నటుడు సుమంత్, సియానత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, కోటంరెడ్డి వినయ్ రెడ్డి ఆయన క్లాస్‌మేట్స్. జగన్ అన్నింటిలో ముందుండే వారని వారంతా గర్వంగా చెప్తున్నారు.