దారులన్నీ శారదా పీఠం వైపే..!

386
jagan sharadhapeetam
- Advertisement -

విశాఖలోని శార‌దా పీఠం. ఆధ్యాత్మిక‌త‌కు,యాగాల‌కు కేరాఫ్. ఇక్క‌డ కొలువై వున్న అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్యలో క్యూ క‌డ‌తారు. భ‌క్తి స్వ‌రూపుడైన పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామీజీని అనుస‌రిస్తారు. ఆయ‌న బోధ‌న‌ల‌ను ..ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన ఆధ్యాత్మిక , ధార్మిక విలువ‌ల‌ను ఆల‌కిస్తారు. ఇదంతా గతం కానీ ఇప్పుడు ఆధ్యాత్మికతకు తోడు పొలిటికల్ టచ్‌ తోడైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు శారదాపీఠాన్ని దర్శించడం,ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో యాగాలు నిర్వహించడంతో శారదా పీఠం పేరు మరింత పాపులరైంది. ఇక అదేబాటలో పయనిస్తున్న ఏపీ కాబోయే సీఎం జగన్‌ పలుమార్లు శారదా పీఠాన్ని దర్శించారు. తన గెలుపుకోం యాగాలు నిర్వహించారు. అంతేగాదు జగన్ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారు చేసింది స్వరూపానందేంద్ర స్వామీజీనే.

దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ నాయకుల హడావిడితో శారదా పీఠం సందడిగా మారింది. స్వరూపానందేంద్ర సరస్వతి దర్శనానికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు బారులుతీరుతున్నారు. విశాఖ ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు ఇతర జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు తరలివస్తున్నారు.

ఉంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితో పాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ఉదయభాను సామినేని, శంబంగి చిన అప్పలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్‌నాథ్‌, కురసాల కన్నబాబు, కాపు రామచంద్రారెడ్డి, అన్నా వెంకటరాంబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వామీజీని దర్శించుకున్నారు. దీంతో శారదాపీఠానికి రాజకీయ కళ సంతరించుకుంది.

- Advertisement -