జూన్ 2న సీఎం కేసీఆర్… ఇఫ్తార్ విందు

380
kcr iftar
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జూన్ 2న సాయంత్రం 7 గంటలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక రంజన్ సందర్భంగా పేద ముస్లింలకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనుంది సర్కార్‌. ఇప్పటికే పలు జిల్లాల్లో రంజాన్ కానుకల పంపిణీ ప్రారంభమైంది. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు.

ఒక్కో మసీదు ద్వారా 500 మందికి చొప్పున జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపికచేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనున్నారు. మిగిలిన జిల్లాల పరిధిలో ఎంపికచేసిన 367 మసీదులతోపాటు 17 రిజర్వ్ మసీదులను కలుపుకొని 384 మసీదుల్లో 1.92 లక్షల గిఫ్ట్ ప్యాకులను అందజేస్తారు.

ఇఫ్తార్ విందు కోసం మసీదుకు రూ.1 లక్ష ఏటా ప్రభుత్వం దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నిధులను వక్ఫ్‌బోర్డు నుంచి నేరుగా మసీదు కమిటీ ఖాతాలోకి జ మచేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.4.48 కోట్లు, జిల్లాల్లో ఇఫ్తార్ విందులకు కోట్లు కేటాయించారు. ఒక్కో మసీదులో 500 మందికి విందు ఏర్పాటుచేస్తున్నారు. మసీదులకు కేటాయించిన నిధుల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

- Advertisement -