రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ 3 లక్షల మంది పేదలకు రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్ లో రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పేద ముస్లిం లకు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు హరీష్.
మే 31న రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పండగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించాలని కేసీఆర్ ఆశయమన్నారు.రాష్ట్రంలో300 ఇంగ్లీషు మీడియం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రతి పేద ముస్లిం అమ్మాయిలను చదివించాలన్నదే కేసీఆర్ ఆశయమన్నారు. అందరిని చదివించడం వల్లనే పేదల జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. త్వరలోనే ముస్లిం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెంచిన ఫించన్ అందిస్తామన్నారు. సిద్దిపేట ను క్లిన్ గ్రీన్ సిద్దిపేట గా ఉంచడానికి అందరూ సహకరించాలని సూచించారు.