చంద్రబాబకు ఫోన్ చేసిన జగన్…ఎందుకో తెలుసా?

409
Jagan PhoneTo Chandrababu
- Advertisement -

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈనెల 30న విజయవాడలోని ఇందిరా స్టేడియంలో జరిగే తన ప్రమాణస్వీకారాణికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు జగన్. చంద్రబాబకు తానే స్వయంగా ఫోన్ చేసి రావాలని తెలిపారు. ఓ సినియర్ నేతగా, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో అతన్ని ఆహ్వానించినట్లు తెలుస్తుంది.

తన తండ్రి దివంగత వైఎస్ కు మీరు సమకాలీకులని గుర్తు చేసిన జగన్, ప్రమాణ స్వీకారానికి వస్తే తాను ఆనందిస్తానని చెప్పినట్టు సమాచారం. ఇక జగన్ సాదరంగా ఆహ్వానించడంతో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. మరీ జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు వస్తారా లేదా ఆన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎల్లుండి జరిగే జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఛీప్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తుంది. ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

- Advertisement -