బెంగళూర్ సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండడంతో ఓటమి తప్పదని భావించిన ఆయన తన మద్దతుదారులతో కలిసి బయటికి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కేవలం 2.3 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రత్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ 49.3 శాతం, బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ 45.6 శాతం ఓట్లతో ఎంతో ముందు నిలిచారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.. ఈ ఫలితాలు చూస్తుంటే గట్టిగా లాగిపెట్టి చెంప చెళ్లుమనిపించినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. “ఎన్నో దూషణలు, తిట్ల పర్వాలు, విమర్శలు, వేధింపులు చవిచూశాను. అయితే ఎప్పుడూ ఇలాగే ఉంటాను. లౌకికవాద భారతదేశం కోసం నా పోరాటం ఇకపైనా కొనసాగుతోంది. కఠిన ప్రయాణం ఇప్పుడే మొదలైందనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.