ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ఎక్కడా.!

170
lagadapati rajagopal

ఊరంతా ఒకదారి అయితే.. ఉలిపికట్టెది మరోదారి అన్న సామేత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సరిగ్గా సరిపోతుందేమో. సర్వేలన్ని ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఒక్క లగడపాటి మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ తీరా చూస్తూ సీన్ రివర్స్‌..తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో జరిగిన తప్పే మళ్లీ రిపీటైంది.

ఈ ఆంధ్రా ఆక్టోపస్‌ చేసిన సర్వే బోగస్ అని తేలిపోయింది. లగడపాటి అంచనాలకు అందని విధంగా ఫలితాలు వచ్చాయి. జగన్ తిరుగులేని ఆధిక్యతతో విజయబావుట ఎగురవేశారు.దీంతో ఆయన సర్వేపై ప్రజలకున్న కాసింత నమ్మకం పోయింది.

వాస్తవానికి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని అన్ని సర్వేలు చెప్పిన సమయంలో లగడపాటి మాత్రం కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. అయితే ఆంధ్రా అక్టోపస్ అంచనా ఫెయిలయింది. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాల్లోనూ లగడపాటి అంచనాలు తప్పాయి. దీంతో రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయతలేదని తేలింది.