ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా, 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటివరకూ కౌంట్ చేసిన ఓట్లలో వైసీపీకి 50.9 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 38.2 శాతం ఓట్లు, జనసేనకు 6.8 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక మంత్రులుగా పనిచేసిన నారా లోకేశ్, అఖిలప్రియ, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, అమర్నాథ్రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర వెనుకంజలో ఉన్నారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, తిరువూరు నుంచి జవహర్, చిలకలూరిపేట నుంచి ప్రత్తపాటి పుల్లారావు ముందంజలో ఉన్నారు. ఎంపీ స్థానాల్లోనూ వైకాపా అధిక్యంలో ఉంది. వైకాపా 20 స్థానాల్లో, తెదేపా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.