లగడపాటి సర్వే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే గెలుపు..

233
Telangana
- Advertisement -

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేస్తుందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాలను ప్రకటించారు. 17 లోక్‌సభ స్థానాలకు 14 నుంచి 16 స్థానాలు రావొచ్చని, కాంగ్రెస్ కు 0-2 స్థానాలు, బీజేపీకి 0-1 స్థానం, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని తమ అంచనా అని పేర్కొన్నారు.

 ఇక 14 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం లో ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మెత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది.

- Advertisement -