ఏపీలో మళ్లీ టీడీపీదే హవా..

159
Lagadapati survey

ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను రాజగోపాల్ విడుదల చేశారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలపై తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్‌ ఎక్కారని నిన్న వెల్లడించిన ఆయన ఈ రోజు అంకెలతో కూడిన ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగినప్పటికీ తెదేపాదే గెలుపు అని స్పష్టంచేశారు.

అసెంబ్లీ స్థానాల్లో టీడీపీదే హావా అని లగడపాటి తేల్చి చెప్పారు..

టీడీపీ- 100 (10సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

వైఎస్ఆర్‌సీపీ- 72 (7సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇతరులు- 03 (02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇక పార్లమెంట్‌ స్థానాల్లో కూడ టీడీపీదే హావా అని లగడపాటి చెప్పారు..

టీడీపీ – 15 (02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

వైఎస్ఆర్సీపీ -10 ( 02 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు)

ఇతరులు-0 నుండి 1 సీటు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.