చల్లని కబురు అందించిన వాతావరణ శాఖ..

304
nmd
- Advertisement -

వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం వర్షాలు సాధారణంగా ఉంటాయని వెల్లడించింది.

జులై 15వ తేదీ వరకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొంది. దేశ‌వ్యాప్తంగా సాధార‌ణ వ‌ర్ష పాతం న‌మోద‌య్యే ప్రాంతాలు 70 శాతం క‌న్నా ఎక్కువే ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధిక వర్షాపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఫలితంగా దేశ ఆర్థిక ప్ర‌గ‌తి బాగానే ఉంటుంద‌ని స్కైమెట్ సీఈవో తెలిపారు.

- Advertisement -