ప్రతీ మగాడు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి లేకుంటే జైలుకే..!

259
King Mswati of Swaziland

ఆ దేశంలో వయసుకొచ్చిన ప్రతి మగవాడూ కనీసం ఇద్దరు ఆడవాళ్లనుగానీ, అంతకంటే ఎక్కువ మందినిగాని పెళ్లిచేసుకోవాల్సిందేనట. మరి మనదేశంలో ఓవైపు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క ఎన్నో తిప్పలు పడుతుంటే ఆఫ్రికాలోని స్వాజిలాండ్ కు చెందిన రాజు మెస్వాతి-3 ఇలాంటి విచిత్రమైన ఆదేశాలు జారీచేశారు. దేశంలోని మేజర్ అయిన ప్రతీ పౌరుడు కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు 2019, జూన్ నెలను తుది గడువుగా నిర్ణయించారు. ఈలోగా పెళ్లి చేసుకోకుంటే పురుషులు లేదా స్త్రీలకు యావజ్జీవ శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

King Mswati of Swaziland

ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్ లో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా అధికం. అందుకే ఈ దేశాన్ని కన్యల రాజ్యంగా అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష జనాభా మధ్య సమతూకం కోసం ఒక్కొక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని రాజాజ్ఞ జారీ అయింది. అన్నట్లు ఇంత కఠినమైన ఆదేశాలు జారీచేసిన మెస్వాతి-3కి 15 మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారట. అంతేకాదు మెస్వాతి తండ్రి ఏం తక్కువ తిన్నారు.. ఆయన కూడా ఏకంగా 70 మంది భార్యలను చేసుకొని, 150 మందికి పిల్లలతో కన్నారట.

అయితే ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకునేవారికి పెళ్లి ఖర్చులతో పాటు ఆ భార్యలకు ఇళ్లను కూడా ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారట ఈ రాజు. కాగా ఇలాంటి నిబంధన పెట్టడంతో దేశంలో ఆడవాళ్లు ఆ రాజను తిట్టిపోశారు. మహిళలను కేవటం ఆట బొమ్మల చూస్తున్నారని మండిపడ్డారు.