యుఎస్‌లో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీ మృతి

298
sahith reddy

అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంతో తెలుగు యువకుడు మరణించాడు. హైదరాబాద్ నల్లకుంట ప్రాంతానికి చెందిన బొంగుల సాహిత్ రెడ్డి ఎంఎస్ చేసేందుకు యుఎస్ వెళ్లాడు. ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

సాహిత్‌ రెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్‌ రెడ్డి, లక్ష్మీ నల్లకుంటలోని పద్మా కాలనీలో నివాసం ఉంటున్నారు.కుమారుడి మృతితో కుటుంబసభ్యులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.