మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా ఏబీసీడీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ హిట్ మూవీ ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) రీమేక్‌గా తెలుగులో అదేపేరు వస్తుండగా సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ఏబీసీడీ ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
అల్లు శిరీష్ ఫారన్ నుండి హైదరాబాద్ రాకతో మొదలయ్యే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అల్లు శిరీష్ వద్ద ఉన్న ఏ కార్డు పనిచేయక పోవడం..ఈ ఇండియా ట్రిప్ మొత్తం ఓ స్కామ్ అంటూ శిరీష్ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. అమెరికా అమెరికా నిన్ను మిస్సవుతున్నా బాగా అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..దీనికి తోడు బిందేడు నీళ్ల కోసం వాళ్లు పడే కష్టాలు చూస్తే కామెడీ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఇది యూఎస్ కాదు ఇండియా అక్కడ అమ్మాయిలను ఢీల్ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు..సపరేట్ స్కెచ్ వేయాలి అంటూ రొమాంటిక్ యాంగిల్ కూడా టచ్ ఇచ్చారు. డబ్బు విలువ తెలిసేలా యూఎస్ నుండి విహార యాత్ర పేరుతో ఇండియాకి వచ్చిన ఓ అబ్బాయి తన జీవితంలో ఎదురైన సంఘటలని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కనుంది. కృష్ణార్జున యుద్ధం ఫేమ్ రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నాగబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.