సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇంకా 9 రోజుల సమయం మాత్రమే ఉంది. మే 23న భారత ప్రధాని ఏవరో తేలనుంది. అలాగే ఈసారి ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఇప్పడు దేశం మొత్తం ఏపీవైపు చూస్తొంది. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నది చర్చానీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ ఇచ్చిన సర్వేల్లో చాలా వరకూ జగన్ సీఎం అవుతాడని తేల్చి చెప్పేశాయి. ఇక గెలుపుపై వైయస్సార్ సీపీ కూడా చాలా నమ్మకంతో ఉంది.
ఈ నేపథ్యంలో జగన్ తన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి షిష్ట్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా లోటస్ పౌండ్ లోని ఫర్నిచర్ ను అమరావతి కి తరలిస్తున్నారు. సరిగ్గా రిజట్స్ ముందు రోజు జగన్ అమరావతిలోని నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పక్కాగా గెలుస్తామనే సమాచారం ఉండటంతోనే ఆయన పార్టీ కార్యాలయాన్ని మారుస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు జగన్ హైదరాబాద్ లోనే ఉంటాడు అమరావతి సమస్యలు ఆయన పట్టించుకోడు అని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని షిష్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ హైదరాబాద్ కేంద్రంగా ఏపీలో రాజకీయాలు చేస్తున్నాడు అనే మచ్చ ఉండటంతో ..వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఆయన అమరావతికి షిఫ్ట్ అవుతున్నారనే చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితమే జగన్ అమరావతిలో సొంత ఇళ్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే.