హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్..ఎందుకో తెలుసా?

278
Prabhas
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీని యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆక్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని సాహోను బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తున్నారు.

అంతేకాకుండా బాలీవుడ్ లో సాహో శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈసినిమాను హిందీలో విడుదల చేస్తుండటంతో సొంతగా డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. హిందీలో ప్రభాస్ కు మంచి పట్టుఉన్నప్పటికి ఆయన మాట్లాడితే దక్షిణాది యాస వస్తుండటంతో..ఉత్తారాదీ యాస వచ్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు ప్రభాస్.

ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ 15న ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. సాహో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈసినిమాతో పాటు ప్రభాస్ మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. జిల్ మూవీ దర్శకుడు రాథాకృష్ణతో ప్రభాస్ తన తర్వాతి మూవీని చేయనున్నాడు. ఈసినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటించనుంది.

- Advertisement -