ప్రారంభమైన మూడవ విడత పరిషత్ ఎన్నికలు

249
mptc
- Advertisement -

తెలంగాణలో మూడవ విడత పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలోని 27జిల్లాలలో పోలింగ్ జరుగనుండగా 9,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

మూడవ విడత ఎన్నికల్లో 160జెడ్పిటీసీ, 1708 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 30 ఎంపీటీసీ స్ధానాలు, ఒక జెడ్పీటీసీ స్ధానంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో విడత భాగంగా 160జెడ్పీటీసీ స్ధానాలకు 741మంది అభ్యర్దులు బరిలో ఉండగా, 1708 ఎంపీటీసీ స్ధానాలకు 5,726 మంది అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. ఇవాల్టీతో స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగియనున్నాయి. మే 27న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -