కేసీఆర్ కేరళ టూర్ వెనుక అసలు కారణం అదేనా…!

261
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ రాజకీయలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్‌లోకి కమ్యూనిస్టులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల ప్రాంతీయ ప్రార్టీ నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తున్నారు. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో చర్చలు జరిపారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి సీఎం కేసీఆర్‌ ఆయనతో మాట్లాడారు. అయితే కేసీఆర్‌ కేరళ, తమిళనాడు, కర్ణాటక టూర్‌ వెనక మరో ఉద్యేశం ఉన్నట్లు రాజకీయ విశ్లేశకుల అంచనా వేస్తున్నారు.

cm kcr kerala tour

ఇదివరకు బీజేపీకి కేసీఆర్‌ అనుకూలంగా ఉన్నట్లు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పలుపార్టీలు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ బీజేపీకి మద్దతు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చెడు ప్రచారనికి చెక్‌ పెట్టాలనే.. కాంగ్రెస్‌,బీజేపీకి తాను దురమని చేప్పడానికే ఈ టూర్‌ ప్లాన్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది.

ఈ అనుమానాలు ఎంత వరకు నిజమో.. అబదమో తెలియదు కానీ.. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఒకతాటిపైకి తీసుకురావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వామపక్ష సీఎం లను కలుస్తున్నాట్లు తెలుస్తోంది.

- Advertisement -