గులాబీ గ్రామంగా కాపుల కనపర్తి..

255
TRS
- Advertisement -

వరంగల్ రూరల్ జిల్లాలోని కాపుల కనపర్తి గ్రామం మొదటి నుంచి రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం. తెలంగాణ ఉద్యమంలోనూ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ఆ గ్రామం పేరాల రఘుపతిలాంటి ఉద్యమ యువ కిషోరాల్ని కూడా అందించింది.

కేసీఆర్ అన్నా..టీఆర్ఎస్ పార్టీ అన్నా ఆ గ్రామం మరో ఆలోచనకు తావులేకుండా ఒక్కటవుతుంది.. ప్రతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కడుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ను ఏకగ్రీవం చేశారు.. ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి భారీ మెజారిటీ ఇచ్చారు.. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి సుతారి బాలకృష్ణ కోసం ఆ గ్రామం చీమల దండులా కదిలారు.

TRS

మొదటి నుంచీ కేసీఆర్ పట్ల పూర్తి అభిమానం..టీఆర్ఎస్ పట్ల నిబద్ధత నమ్మకం ఉన్న ఈ గ్రామాన్ని గులాబీ గ్రామంగా అభివర్ణిస్తారు రాజకీయ నేతలు.. గతంలో ఎమ్మల్యే, ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని సమస్యల కోసం నిలదీసిన చరిత్ర కూడా ఈ గ్రామానికి ఉంది.. సో ..మొత్తానికి అభిమానించినా.. అదిరిపోతుంది.. సమస్యలు పరిష్కారం కాలేదో..ఇక ఆ ఎదురుదాటి కూడా అంతే తీవ్రంగా ఉండటం ఈ గ్రామ స్పెషాలిటీ.

- Advertisement -