- Advertisement -
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. పురుషుల 52 కిలోల విభాగంలో అమిత్ పంఘాల్ కు, 56 కిలోల విభాగంలో కవిందర్ సింగ్ బిస్త్ కు స్వర్ణ పతకాలు లభించాయి. అమిత్ పంఘాల్ అద్భుతమైన పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థి హు జియాంగువాన్ (చైనా)పై విజయం సాధించగా..ఎంఖ్-అమర్ ఖఖూ (మంగోలియన్)ను కవిందర్ సింగ్ బిస్త్ అద్భుతమైన ప్రదర్శనతో 3-2తో ఓడించాడు. భారత్ రెండు స్వర్ణ పతకాలు దక్కడంపై క్రీడాభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
- Advertisement -