సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ‘ప్రే ఫర్ శ్రీలంక’

298
sai datta peetam

ఈస్టర్ సండే రోజు మన భారత దేశానికి పొరుగు దేశమైన శ్రీలంక బాంబుల మోతతో దద్దరిల్లింది. ఐసిస్ ఉగ్రవాదులు కొలంబో లోని ఎనిమిది చోట్ల బాంబులు పేల్చడంతో 359 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మంది గాయపడ్డారు. మూడు చర్చిలు, నాలుగు హోటళ్లలో ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. దీంతో ఎల్‌టీటీఈ తుడిచిపెట్టుకుపోయిన పదేళ్ల తర్వాత లంక మళ్లీ నెత్తురోడింది.

ఈ విపత్కర సమయంలో శ్రీ లంక దేశం లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మన ప్రగాఢ సంతాపం తెలియ చేయాల్సిన సమయమిది. ఈ సందర్భంగా న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు కూడా ఐన రాణి ఊటుకూరు అమరులైన వారికి ఘన నివాళులర్పించారు.

sai datta peetam

ఫ్రాంక్లిన్ టౌన్షిప్ నుండి శ్రీ లంక కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి మాట్లాడుతూ ఉగ్ర దాడిని అందరూ అన్ని మతాలవారూ ఖండించాలని శ్రీలంక ప్రజల యెడల సాయి దత్త పీఠం నిర్వహించిన ఈ క్రొవ్వొత్తి దీప ప్రదర్శన, మౌన ప్రదర్శన కు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ విషయాన్ని న్యూ యార్క్ లో శ్రీ లంక అంబాసిడర్ కు తెలియపరుస్తానని చెప్పారు. షుమారు 200 మంది భక్తులు క్రొవ్వొత్తి ప్రదర్శనతో నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రేమ, సర్వ మత సమానత్వం కై బాబా వారి బాటలో నడవాలని రఘు శర్మ పిలుపునిచ్చారు.

sai datta peetam sai datta peetam