తీవ్రవాదం ప్రపంచానికే పెను ముప్పు..

155

మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇస్లామిక్ తీవ్రవాద బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన  హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడ వాసి శ్రీ వేమూరి తులసీరామ్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించారు.

Bandaru Dattatraya

అనంతరం ఆయన మాట్లాడుతూ: పవిత్రమైన ఈస్టర్ ఆదివారం రోజున శ్రీ లంకలో ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు జరిపిన బాంబు దాడులు ప్రపంచాన్నంతటిని తీవ్రా దిగ్రాంతికి గురిచేసిందని అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ నివాసి శ్రీ వేమూరి తులసీరామ్ తన మిత్రులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లి ఈ బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి తల్లి నళినికి ఏకైక కుమారుడు శ్రీ తులసీరామ్ ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయిందని, ఆమెను ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశానని తెలిపారు.

ఇస్లామిక్ తీవ్రవాదం ప్రపంచ మనుగడకే పెను ముప్పుగా మారిందని, ఇది కేవలం ఒక మతానికో లేక ఒక కులానికో పరిమితం కాలేదని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందిగా కోరారు. తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.