ఐపిఎల్ 12 సీజన్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై చైన్నై విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వార్నర్ 45బంతుల్లో 57పరుగులు చేసి అవుట్ కాగా, మనీశ్ పాండే 49బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఒపెనర్ బెయిర్ స్టో సున్నా పరుగులకే అవుట్ కాగా, విజయ్ శంకర్ 26పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈమ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో బెర్త్ సంపాదించుకుంది. 175 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.5ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
ఓపెనర్ షేన్ వాట్సన్ 53బంతుల్లో 96 పరుగులు చేశాడు. అంతేకాకుండా చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా 24బంతుల్లో 38పరుగులు చేశాడు. ఈసందర్భంగా షేన్ వాట్సన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.