మెగా హీరోలతో ‘జెర్సీ’ దర్శకుడు

169
gautham ram charan, Varun Tej

న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. ఎప్రిల్ 19న విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. అంతేకాకుండా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురపిస్తోంది. నాని సరసన హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నటించింది. ఈచిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు ఎదుర్కొంటుంది. ఈమూవీ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి డిమాండ్ బాగా పెరిపోయింది.

టాప్ నిర్మాతలందరూ అతని దగ్గరకు వెళ్లి డేట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇటివలే నిర్మాత దిల్ రాజు వరుణ్ తేజ్ కాంబో కోసం గౌతం ఓ స్టొరీ రెడీ చేశాడని టాక్ వచ్చింది. అంతేకాకుండా తాజాగా రామ్ చరణ్ కోసం కూడా గౌతమ్ ఓ కథను సిద్దం చేశాడని తెలుస్తుంది. ఎన్వి ప్రసాద్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా గౌతం ఓ పీరియాడిక్ డ్రామా చెప్పబోతున్నాడన్న వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్నాడు. ఇంకో ఆరు నెలల వరకు అతని డేట్స్ ఖాళిగా లేవు..కాబట్టి ఇప్పట్లో ఆయన వేరే స్టోరీలను వినే మూడ్ లో లేడని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ తర్వాత వరుణ్ తేజ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.