- Advertisement -
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఇవాళ ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా అమేధీలో భారీ ర్యాలీని నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు.
ఈ రోడ్ షోలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు పాల్గోన్నారు. అమేథీలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాహుల్ తల్లి సోనియా గాంధీ నేరుగా తన కారులో వచ్చారు. ఇటీవలే కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం రాహుల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎన్నికల్లో రాహుల్ రెండు స్ధానాల నుంచి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -