కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్..

344
konda-vishweshwar-reddy
- Advertisement -

పోలింగ్‌కు మరికొద్ది గంటలే సమయం ఉండగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాయర్ సందీప్ రెడ్డి నుండి దాదాపు 10 లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ టవర్స్‌లో ఉంటున్న సందీప్‌ దగ్గరి నుండి 3 ల్యాప్‌ ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్లలో ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు,ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారాయి అన్న కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు ఏపీలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌పై ఐటీ అధికారులు దాడుల చేశారు.జయదేవ్‌ కంపెనీలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న గుర్రప్పనాయుడు ఇంట్లో మంగళవారం సాయంత్రం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అమరరాజా బ్యాటరీ కంపెనీకి మేనేజింగ్‌ డైరక్టర్‌గా కొనసాగుతున్న గల్లా జయదేవ్‌… 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు 680 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -