ఒక్క మాటలేకుండా..మ్యూజిక్‌తోనే ముగించేశారు

290
kalki movie teaser
- Advertisement -

‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి. గరుడవేగ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన రాజశేఖర్ షార్ట్ గ్యాప్‌లో కల్కిగా రాబోతున్నాడు.1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

గ్రాండ్‌ విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. ఒక్కమాట లేకుండా కేవలం మ్యూజిక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -