పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా విసృతంగా ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ ప్రచారంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. బిజి షెడ్యూల్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు కేటీఆర్.
ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మీటింగ్‌లో పాల్గొననున్న కేటీఆర్… మధ్యామ్నం 12 గంటలకు అడ్వాకేట్స్ టీఆర్ఎస్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో వేములవాడ కొడా దేవన్న, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి మున్నూరుకాపు నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తారు.
ఆ తర్వాత రోడ్‌షోల్లో పాల్గొంటారు కేటీఆర్. సాయంత్రం 04:30 గంటలకు ఘట్ కేసర్‌లో రోడ్ షో నిర్వహించనుండగా.. 05:30 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేరుకుంటారు. శాంతినగర్, అడ్డగుట్ట, ఎస్‌వీఎస్ జంక్షన్, మైలర్‌గడ్డ మీదుగా ఆయన రోడ్ షో కొనసాగనుంది. ఇక రాత్రి 8 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గంలో పరిధిలోని జబ్బర్ కాంప్లెక్స్, సత్యం థియేటర్ ప్రాంతాల్లో రోడ్‌షోలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు కేటీఆర్.