‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ అనిత. తొలి సినిమాతోనే స్టార్డమ్ సంపాదించుకున్న అనిత కెరియర్ మొదట్లో మంచి ఛాన్స్‌లే అందుకున్న ఆ తర్వాత సినిమా ఆఫర్స్ లేక బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కూడా అనితకు సరైన అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం హిందీ సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో వ్యాపారవేత్త రోహిత్ శెట్టితో ప్రేమలో పడటం పెళ్లి వరకు వెళ్లింది. ఇటీవలే ఆమె ప్రెగ్నెంట్ అని, కవలలకు జన్మనివ్వనున్నారనే వార్తలు వినిపించాయి. వీటిని స్పష్టం చేస్తూ అనిత తాజాగా నిండు గర్భిణిగా ఉన్న బేబీ బంప్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను కవలలకు జన్మ నివ్వబోతున్నట్టు తెలిపింది.
ఇద్దరు క్యూ క్యూట్ బేబీస్ త్వరలోనే రానున్నారు అని తెలిపింది. రీసెంట్గా తన భర్తతో ఉన్న ఎమోజీని షేర్ చేస్తూ.. నా ప్రేమికుడా, నీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.