సుధీర్ బాబుతో నాని ‘వ్యూహం’..!

771
nani sudeer
- Advertisement -

నేచరల్ స్టార్ నాని-సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉండగా సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

సుధీర్ బాబు పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, నాని విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది లేదా మణిశర్మ సంగీతం అందించనుండగా ఇటీవ‌ల నాని స‌ర‌స‌న అదితిరావుని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి వ్యూహం అనే టైటిల్‌ని ఖరారు చేశారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ క్లారిటీ వస్తుందో వేచిచూడాలి. నానితో అష్టాచెమ్మా,సుధీర్ బాబుతో సమ్మోహనం మూవీ భారీ విజయాన్ని నమోదు చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ మల్టీస్టారర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచిచూడాలి.

ప్ర‌స్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు నేచుర‌ల్ స్టార్. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా 2019లోనే విడుద‌ల కానుంది.

- Advertisement -