ప్రియాంక-నిక్ విడాకులు..!

820
priyanka nick
- Advertisement -

ఆమె వయసు 36.. అతని వయసు 26. ఒకరు ఇండియన్ హీరోయిన్.. మరోకరు హాలీవుడ్ సింగర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2018 డిసెంబర్ 1, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనస్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండియన్ అమ్మాయికి.. ఇంగ్లీష్ అబ్బాయికి జోడీ కుదిరిందని అంతా సంబరపడ్డారు.

పెళ్లయి నాలుగు నెలలు కూడా కాకముందే వీరి పెళ్లి పెటాకులయ్యేలా ఉందని ఇంగ్లీష్ మీడియా కోడై కూస్తోంది. ప్రియాంక -నిక్ వైవాహిక జీవితంపై ఓ అమెరికన్ మ్యాగజైన్ ప్రచురించిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రియాంక, నిక్ దాంపత్య జీవితం సాఫీగా సాగడం లేదని…ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని కథనాన్ని ప్రచురించింది. త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ రాసేసింది. నిక్ ఫ్యామిలీ వీలైనంత త్వరగా ప్రియాంకతో తెగతెంపులు చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలిపింది. ఇద్దరూ ప్రతి విషయానికి కొట్లాడుకుంటున్నారు. ఇద్దరూ తొందరపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తున్నారని ఆ కథనంలో రాసుకొచ్చింది.

ప్రస్తుతం ప్రియాంక, నిక్ లాస్ ఏంజెల్స్ లో నివసిస్తుండగా ఈ వార్తలన్నిటిని ప్రియాంక ప్రతినిధి ఖండించారు. ఇవి కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు.

- Advertisement -