తెలంగాణ రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్‌కు నర్సయ్యగౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.
మెదక్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కొత్త ప్రభాకర్‌రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.