బీజేపీలోకి గంభీర్..ఎంపీగా పోటీ

226
gambir
- Advertisement -

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. శుక్రవారం కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్,అరుణ్‌ జైట్లీ సమక్షంలో బీజేపీలో చేరారు. గంభీర్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మోడీని చూసి తాను స్పూర్తిపొందానని తెలిపిన గంభీర్ తనను పార్టీలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ ద్వారా ఇప్పటివరకు దేశానికి సేవలందించానని ఇకపై ప్రజా సేవలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు.

లోక్ సభ ఎన్నికల్లో గంభీర్ పోటీచేసే అవకాశం ఉంది. దేశరాజధాని ఢిల్లీకి చెందిన గంభీర్‌ను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి స్థానంలో పోటీలో పెట్టే యోచనలో ఉంది బీజేపీ.మీనాక్షి లేఖీకి పనితీరుపై ప్రజలు అనంతృప్తితో ఉండటంతో పాటు గంభీర్‌ను బరిలోకి దింపడం ద్వారా తమకు లాభిస్తుందని భావిస్తుంది బీజేపీ హైకమాండ్.

డ్యాషింగ్ అండ్ డేరింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న గంభీర్ ఇటీవలె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 1999లో ఢిల్లీ తరపున రంజీల్లో ఆరంగేట్రం చేసిన గౌతీ…టీమిండియా రెండు ప్రపంచకప్‌లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ లో కొల్ కతా కెప్టెన్ గా రెండుసార్లు టైటిల్ ను అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా గంభీర్ సభ్యుడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర ఒత్తిడిలో 122 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం అందుకున్నాడు. ఈ మధ్యే పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

- Advertisement -