గో మాత సేవలో జనసేనుడు..

285
pawan
- Advertisement -

ప్రకృతిని ప్రేమించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి వ్యవసాయమన్నా, పశు పోషణ అన్నా అమితమైన ఇష్టం. రైతు జీవితం… పాడి, పంట కలనేత అని చెబుతారు జనసేనాని. ఆయన సమయం దొరికినప్పుడల్లా స్వయంగా అటు వ్యవసాయం చేస్తూ.. ఇటు గోవులకు సేవ చేస్తూ ఉంటారు. అందుకే పార్టీ మూల సిద్ధాంతాలలో ‘సంస్కృతుల్ని కాపాడే సమాజం’ అంటూ వాటికి పెద్ద పీట వేశారు పవన్‌.

ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే గోమాతలకు మేత వేసి
వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

ఇక పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు ‘జనసేన’ సమాయత్తమవుతోంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సభ నిర్వహించనున్నట్టు ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -