టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలలో నటించిన అతి కొద్ది అగ్ర తారల్లో నగ్మా ఒకరు. అందచందాలతో, యాక్టింగ్‌తో అప్పట్లో సౌతిండియాను ఓ ఊపు ఊపేసింది నగ్మా. అప్పటి యూత్‌కు నిద్ర లేకుండా చేసిన రికార్డు ఆమె సొంతం. అలాంటి ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక నగ్మా సినిమాలకు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల వైపు మళ్లీ చూడలేదు. అయితే తాజాగా నగ్మా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబనేషన్లో వస్తున్న మూవీలో నగ్మా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నగ్మా క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబనేషన్లో వస్తున్న సినిమాలో చేయాలని తనను ఎవరూ సంప్రదించలేదని.. అలాంటి న్యూస్ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావటం లేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తన వద్దకు ఒక సస్పేన్స్ థ్రిల్లర్ సినిమా కోసం వచ్చారని.. ఆ కథ నచ్చింది కానీ అందులో తాను కొన్ని మార్పులు చేయమని చెప్పాను. దాని మీద వారు వర్క్ వుట్ చేస్తున్నారని.. అది కనుక అనుకున్నట్లుగా వస్తే మాత్రం తాను ఆ సినిమాలో చేసే అవకాశం ఉందన్నారు.
ఇక ఇంతవరకు పెళ్లి చేసుకోని నగ్మా తన పెళ్లిపై తాజాగా స్పందించారు. మీ పెళ్లి అనే ప్రశ్నకు నగ్మా సమాధామనమిస్తూ .. ‘‘దేవుడు పెళ్లి జరగాలని రాసిపెట్టినప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఎవరి జీవితంలో పెళ్లి ఎప్పుడు కావాలి? అసలు ఉంటుందా? లేదా?.. ప్రతిదీ దేవుడు ముందే రాసిపెడతాడు. నేను దాని గురించి డిసైడ్ చేయాల్సింది ఏముంది? నేను మ్యారేజ్‌కి వ్యతిరేకం కాదు’’ అని పేర్కొంది. మరి ఈ అమ్మడు సినిమాలు మళ్లీ చేస్తుందా..? పెళ్లి చేసుకంటుందా..? ఈ విషయాలు తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.