118 మూవీ ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్ట్ లుగా ఆ ఇద్దరూ..

249
118 movie
- Advertisement -

నందమూరి కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ 118. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈమూవీ తెరకెక్కుతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నివేధా థామస్, షాలిని పాండేలు హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కొనేరు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈనెల 25వ తేదిన ఈచిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఇద్దరూ హీరోలు రాబోతున్నట్లు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

kalyan ram 118

అయితే తాజాగా ఈపుకార్లకు బ్రేక్ వేసింది 118 చిత్రయూనిట్. ఈ మూవీ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హాజరుకానున్నట్లుగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. బాలకృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్.. ఈ మధ్య జరిగిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆడియో వేడుకలోనూ, అలాగే ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌లోనూ కనిపించి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 118 ఆడియో వేడుకలో ఈముగ్గురు మరోసారి ఒకే వేదిక మీద కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -