క్యాస్టింగ్ కౌచ్‌తో టాలీవుడ్‌లో సంచలనం రేపిన నటి శ్రీ రెడ్డి. కొంతకాలంగా చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అడుగుపెడుతు పెడుతునే ఎన్నారై జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి మద్దతుగా నిలిచిన ఈ బ్యూటీ మరోసారి బాంబు పేల్చింది. శ్రీ రెడ్డి ఈజ్ బ్యాక్..అంటూ ఈసారి దర్శకుడు కొరటాల శివని టార్గెట్ చేసింది.
తన బయోపిక్ తీస్తే అతనే కొరటాల శివనే విలన్ అంటూ వ్యాఖ్యానించిన శ్రీరెడ్డి ఆయనది వరల్డ్ నెం.1 వరస్ట్ క్యారెక్టర్ అనేసింది. కమర్షియల్ సినిమాలు తీయడం కాదు.. ఆ సినిమాతో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చి సామాజిక బాధ్యతను గుర్తు చేయడం ఆ దర్శకుడి శైలి. మిర్చి , శ్రీమంతుడు ,జనతా గ్యారేజ్, భరత్ అనే నేనుచిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించిన కొరటాలది చెత్త క్యారెక్టర్ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. కొరటాల (కేఎస్) బస్ ఆఫ్ కామసూత్ర అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.
గతంలో సైతం కొరటాలపై శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఛాన్సులు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది.తాజాగా మరోసారి కొరటాల శివను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.