రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేది వీరే..!

218
CM KCR
- Advertisement -

తెలంగాన కెబినెట్‌ విస్తరణపై ఎర్పడిన ఉఠ్కంటకు తెరపడింది. ఎప్పుడు ఎప్పుడాని ఎదురుచూస్తున్న తెలంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌లో నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌భవన్ లాన్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

నూతన మంత్రులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. కేసీఆర్‌ పిలుపుతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌లు వచ్చి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌లను కలిశారు. అయితే మంత్రి పదవి ఆశించి రానివారికి కూడా కేసీఆర్‌ ఫోన్‌ చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించే నేతలేవరు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ సజావుగా సాగబోతుంది. మరో దఫాలో మరికొంత మందికి స్థానం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

CM KCR

నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే.. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు,ఇంద్రకర్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌,జగదీశ్వర్‌ రెడ్డి,సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి,వేముల ప్రశాంత్‌ రెడ్డి,పద్మాదేవేందర్‌ రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నా ఇంకా సరైన స్పష్టత రాలేదు..మిగిలిన వారంతాకూడా మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరికి ఏ పదవులు కేటాయిస్తారనేదనిపై క్లారిటీ రాలేదు.లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కెబినేట్‌ విస్తరణ జరగనుంది.. కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, లక్ష్మరెడ్డిలకు ఈ దఫాలో చోటు దక్కకపోవడం చర్చాంశనీయంగా మారింది.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రొటోకాల్ విభాగం నుంచి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది రిహార్సల్ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు.

- Advertisement -