ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు..

244
MLC election
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 28వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టి. సంతోష్‌కుమార్, మహ్మద్ సలీం, మహమూద్ అలీ పదవీ విరమణ చేయనున్నారు.

- Advertisement -