నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సినిమా చేసేందుకు రెడీ అయ్యారు స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అర్జున్ నిర్మిస్తున్నారు. ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేసే బన్నీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు బన్నీ. కూతురు అర్హాతో వీడియోని షేర్ చేశారు. నాన్న నేను నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అని ఒక్కో మాటను బన్నీ చెప్తూ ఉంటే అర్హ నాన్న.. చెబుతున్నట్టుగానే ఎంతో ముద్దుగా చెప్తుంది. అయితే చివర్లో పెళ్లి చేసుకుంటావా? అంటే మాత్రం మాట మార్చి చేసుకోను అంటూ ముద్దు ముద్దు మాటలతో సమాధానం చెప్పింది.
హేయ్ దొంగ.. చేసుకుంటాను అని చెప్పూ.. అని బన్నీ మళ్లీ అడిగినా.. చేసుకోను అని తెగేసి చెప్పేసింది. ప్లీజ్ రా.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకోరా అంటే.. ఊహూ అంటూ తల ఊపి.. నో చెప్పేసింది అర్హ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి…